మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 05, వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బానోత్ విజయభాయి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన గడప గడపకు విజయభాయి కార్యక్రమాన్ని మంగళవారం మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను పలకరిస్తూ, బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కలిగే ప్రయోజనాలను ప్రచారం చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదనరావు, ముత్తినేని రామయ్య, లింగారావు, పోతురాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.