*బీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్
మన్యం న్యూస్,కరకగూడెం:మండల పరిధి వెంకటపూరం గ్రామానికి చెందిన పోలెబోయిన.రామ్మూర్తికి రూ.14 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అదేశాల మేరకు బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య మంగళవారం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్య సమస్యలకు ఆర్థిక వరం ముఖ్యమంత్రి సహాయనిది పథకం అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు ఎలగోండ.వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
