డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే
* సందడిగా కేక్ కటింగ్..
* నిత్యవసర వస్తువులు పంపిణీ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు
కొత్తగూడెం జనహిత కార్యాలయం నందు బుధవారం జర్నలిస్ట్ డే సందర్బంగా డాక్టర్ జి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న పలువురు సీనియర్ జర్నలిస్ట్ పాత్రికేయుల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా
ట్రస్టు నిర్వాహకులు అంజి, ట్రస్ట్ కోఆర్డినేటర్ జోగారావు మాట్లాడుతూ మొదటగా రిపోర్టర్స్ అందరికి జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు డా. జిఎస్ఆర్ ట్రస్ట్ చేసినటువంటి మెగా హెల్త్ క్యాంపులను, మెగా జాబ్ మేళాను, టీబి పెషేంట్ లకు న్యూట్రిషన్ కిట్స్, వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణి, ఫ్రీజర్ బాక్స్, గడప గడపకు వైద్య సేవలు, సమ్మర్ లో చలివేద్రాల సేవలను, ట్రాక్టర్ ద్వారా మంచినీటి పంపిణి, ఆర్టీసీ ప్రాంగణంలో వాటర్ ప్లాంట్ సేవలను, గ్రామీణ యువత ప్రోత్సాహక క్రీడలు, మతాలకు అతీతంగా బతుకమ్మ, సెమీ క్రిస్మస్, ఇఫ్తార్ విందు, సెల్ఫీ విత్ రంగోలి, నిరుద్యోగ యువతకు గ్రంథాలయంలో ఫ్రీ వైఫై, భోజన, టీ వసతుల ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎలక్ట్రానిక్ మీడియా, దిన పత్రికల ద్వారా ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లి డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ సేవలను ప్రజలందరికీ చేరవేసినందుకు పేరు పేరునా అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గడల నరసింహారావు, పుదరి శామ్ కుమార్, మిట్టపల్లి కిరణ్, శర్పా అశోక్, ఆరెళ్లి శ్రీను, మాలోతు శివ, బోడా హరి, ఎస్.సంపత్, నారాయణ, సాగర్, ఎస్విఎన్ ప్రసాద్, సామంతుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.