భద్రాచలంకు రైలు కూత..
* రూ.3,592 కోట్లతో భద్రాచలం నుండి
మల్కస్ గిరి వరకు కొత్త రైల్వే లైన్
* తెలంగాణ ఎంపీలు పోరాట ఫలితం కొత్త లైన్లకు శ్రీకారం
* భద్రాచలం టెంపుల్ కు మరింత ఆదరణ
* అభివృద్ధి జరగనున్న పరిసర ప్రాంతాలు
* ఎంపీలకు భద్రాద్రి ప్రజల కృతజ్ఞతల పర్వం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
రైళ్ల అనుసంధాన్ని బలోపేతం చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టిని సారించింది. దీనిలో భాగంగా తెలంగాణలోని కూడా రైల్వే లైన్ల అభివృద్ధికి ఫోకస్ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఎంపీలు తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లు, అదనపు ట్రైన్లు వేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కేంద్రం రైల్వే మంత్రిత్వ శాఖపై పలుమార్లు ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసింది. తెలంగాణ ఎంపీలు చేసిన పోరాటం మేరకు కేంద్రం దిగివచ్చి తెలంగాణలోని రైల్వే అభివృద్ధికి దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా బుధవారం రైల్వే మంత్రిత్వ శాఖ రూ.3,592 కోట్లతో భద్రాచలం నుండి
మల్కస్ గిరి వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగడంతో పాటుగా రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనున్నది. ఈ లైన్ భద్రాచలం టెంపుల్ టౌన్ మెయిన్ లైన్
రైలు నెట్ వర్క్ తో కలుపుతుంది.
భద్రాచలం ఆలయాన్ని ఛత్తీస్గఢ్ మీదుగా ఒరిస్సాలోని మెయిన్ లైన్లో అనుసంధానించడానికి నూతన రైల్వే లైన్
సహాయపడుతుంది. దీని వలన రైలు అనుసంధానంతో మొదటిసారిగా అనేక కొత్త ప్రదేశాలను కలుపడమే కాకుండా ఈ
ప్రాంతం సామాజిక ఆర్ధిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రం నుండి ఛత్తీస్గఢ్ మీదుగా ఒరిస్సాకు
ప్రయాణీకుల రాకపోకలలో సహాయం చేయడంతోపాటు వ్యవసాయం వ్యాపారం విద్య పర్యాటకం ఆరోగ్య సంరక్షణ మొదలైన
బహుళ కార్యకలాపాలకు కూడా ఉపయోగపడనున్నది.
ఎంపీలకు భద్రాద్రి ప్రజలు కృతజ్ఞతలు..
కేంద్రంపై తెలంగాణ ఎంపీలు పోరాటం చేసిన ఫలితంగా కేంద్రం దిగివచ్చి కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. భద్రాచలం నుండి మల్కస్ గిరి వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.