UPDATES  

 తల్లి,బిడ్డల ఆరోగ్యం పై శిక్షణ కార్యక్రమానికి హాజరైన సర్పంచులు, అధికారులు

తల్లి,బిడ్డల ఆరోగ్యం పై శిక్షణ కార్యక్రమానికి హాజరైన సర్పంచులు, అధికారులు
మన్యం న్యూస్,కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో టీ ఎస్ ఐ ఆర్ డీ స్వర్ణోత్సవ భవన్ లో బుధవారం తల్లి,బిడ్డల ఆరోగ్యం పై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని చిరమళ్ల, వట్టం వారి గుంపు, కన్నాయిగూడెం, తాటిగూడెం గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు, కార్యదర్శిలు, అంగన్వాడి సిబ్బంది హాజరయ్యారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వారికి మహిళలు, పిల్లల ఆరోగ్యం పోషణ ఫలితాలు మెరుగుపరచడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.1000 రోజులలో వారికి కీలకమైన ఆరోగ్యం పోషకాహార ప్రవర్తనలు ,పిల్లల సంరక్షణ ,నియోమొటల్ కేర్, చైల్డ్ ఫీడింగ్ పద్ధతులు, స్టిములేషన్, ఇమ్యునైజేషన్, పోషకాహారం లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించడం,వారి నిర్వహణ, మొదటి వెయ్యి రోజులలో ఆనారోగ్యాన్ని నివారించటం, పరిశుభ్ర ప్రవర్తనలపై వీరికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు పాయం నరసింహారావు ,కొమరం విశ్వనాథం, భూక్య లక్ష్మి, ఆయా పంచాయతీల కార్యదర్శులు, అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !