మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా జిల్లా ఉపాధి కల్పనాధికారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. చిన్నతనం నుండే చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఈ సందర్భంగా నూతనంగా సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన విజేత మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మార్గదర్శకాల మేరకు సిబ్బంది సహకారంతో బాగా పని చేసి శాఖకు మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తానని చెప్పారు. తనపై ఎంతో నమ్మకంతో చాలా ప్రధానమైన శాఖ బాద్యత అప్పగించారని ఈ సందర్భంగా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.