మన్యం న్యూస్,పినపాక:
కృష్ణాష్టమి వేడుకలను మండల వ్యాప్తంగా ముందస్తుగా నిర్వహించారు. గురువారం సెలవు దినం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జన్మాష్టమి వేడుకలు జరిపారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషాధారణలతో అలరించారు. బుడిబుడి అడుగుల కృష్ణులు పాఠశాలల్లో దర్శనమిచ్చారు.
