మన్యం న్యూస్ గుండాల, ఆళ్లపల్లి: గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ఆళ్లపల్లి మండలం రాయపాడు గ్రామంలోని వలస ఆదివాసులు ఇబ్బందుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులను ఇల్లందు డిఎస్పి రమణమూర్తి బుధవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 వలస ఆదివాసీ వ్ కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా నిలిచామని అన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సిఐ ఇంద్రసేనారెడ్డి, ఆళ్లపల్లి ఎస్సై రతీష్, పోలీస్ సిబ్బంది ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
