UPDATES  

 క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి

క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి

డోర్నకల్ సీఎస్ఐ చర్చిని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు:

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజవర్గంలోని డోర్నకల్ గ్రామంలోని సిఎస్ఐ చర్చిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పలువురు పార్టీ ముఖ్య నాయకులు,ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించి,ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్బంగా బిషప్ ఆశీర్వాదం తీసుకున్నారు.తొలిత విప్ రేగా కాంతారావు కు వారు ఘన స్వాగతం పలికారు.అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, అన్ని మతాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపిట వేస్తున్నదని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల వారిని సమ ప్రధానతను ఇస్తూ,ప్రభుత్వ పరంగా వారి పండగల అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు.రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు.అభివృద్ధి,సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు.ఇక్కడ చర్చికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ చర్చి ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉంటాయని,ప్రభు ఆశీస్సులతో నేడు వేదిక ద్వారా ఇంత మందిని కలుసుకోవడం చాలా అనందంగా ఉందన్నారు.అందరి జీవితాలలో గొప్ప మార్పు తీసుకువస్తున్న ఫాదర్ బిషప్ లకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావు ,సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి నవీన్,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్,అక్కిరెడ్డి సంజీవరెడ్డి,వట్టం రాంబాబు,ముద్దంగుల కృష్ణ,ఎడ్ల శ్రీను,తాతారమణ,మడి వీరన్న, నూకరపు రమేష్, వేల్పుల సురేష్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !