ములకలపల్లి. మన్యం న్యూస్.సెప్టెంబర్06: అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు బుధవారం సుడిగాలి పర్యటన చేశారు . ఈ సందర్బంగా ములకలపల్లి,గ్రామాల్లో ఐకేపీ (ఇందిరక్రాంతి పథకం) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టు మిషను కేంద్రాన్ని, మూకమామిడి గ్రామంలో వ్యవసాయ పనిముట్లను ప్రారంభించారు.ఈ సందర్బంగా
ఐకేపి సిబ్బందితో ఆత్మీయంగా మాట్లాడారు.అనంతరం.వివోయేలకు జీతం పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు,ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కు ఐకేపి సభ్యులు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుకు సన్మానం ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులుమోరపూడి అప్పారావు ,ఎంపీటీసీలుమెహర్రమని, సునీత ,ఐకేపి మేనేజర్ రవీంద్ర, సీసీ రమాదేవి,చెన్నమ్మ,గ్రామాదీపికాలు కనక లక్ష్మి, దుర్గ, అనూష సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,మండల నాయకులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
