బీఆర్ఎస్ మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించనుంది
రేగాను అఖండ మెజార్టీతో గెలిపిస్తాం ప్యాక్స్ చైర్మన్ రామయ్య
మన్యం న్యూస్ గుండాల:ప్రజల ఆశీర్వాదం సీఎం కేసీఆర్ కు,పినపాక
నియోజకవర్గ ప్రజల దీవెన రేగా కాంతారావుకు మాత్రమే ఉంటుందని గుండాల పిఎసిఎస్ చైర్మన్ గుగ్గిల రామయ్య అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడవ చరిత్ర సృష్టించనుందని అన్నారు. బుధవారం మండలం పరిధిలోని పడుకొని గూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పథకాలపై విస్తృత ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలిసి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో ఏ నాయకుడు చేయనంత అభివృద్ధిని రేగా చేశారని అన్నారు. ప్రజలకు హామీ ఇస్తే ఇచ్చిన మాటను నెరవేర్చే వరకు తాను నిష్క్రమించడని అన్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వానికి, నాయకులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, సోషల్ మీడియా నాయకులు సతీష్, పార్టీ నాయకులు గంగాధరి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.