మన్యం న్యూస్ ,చర్ల:
మండలంలోని చర్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారంజర్నలిస్టు డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్ల ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు తోటమళ్ల రమణమూర్తి, జి. మణికుమార్ లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ప్రతి ఒక్క వార్తలను సేకరించి ప్రజలకు అందజేయడంలో పాత్రికేయులు ముఖ్యపాత్ర పోషిస్తారని, సేకరించిన వార్తని ప్రజలకు చేరవేయడంలో చర్ల ప్రెస్ క్లబ్ అన్ని వేళలో సహకరిస్తుందని అన్నారు. అందరూ కలిసికట్టుగా కేక్ కట్ చేసి ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.
