మన్యం న్యూస్,మణుగూరు:
కృష్ణాష్టమి సందర్భంగా రామానుజవరం వేణుగోపాల స్వామి టెంపుల్ ప్రాంగణంలో ఉట్టి కొట్టు వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి పాల్గొన్నారు. వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా చూడాలనిఆ భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు , సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు.
