UPDATES  

 హైద్రాబాద్ ను మరో అమెరికాలా మార్చింది కెసిఆర్

హైద్రాబాద్ ను మరో అమెరికాలా మార్చింది కెసిఆర్

*సీఎం కెసిఆర్ మాజీ మంత్రి తుమ్మల కి ఇచ్చిన గౌరవం రాష్ట్రంలో ఏ వ్యక్తికి ఇవ్వలేదు

* పొంగులేటి నీవు ముందు అసెంబ్లీ గేట్లు దాటి రా
* కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు
*ఎమ్మెల్సీ తాత మధు
మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 07: హైదరాబాదును మరో అమెరికాలో మార్చింది సీఎం కేసీఆర్ ఒక్కడేనని ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. గురువారం అశ్వారావు పేట పర్యటించారు. అనంతరం నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా, మండల నాయకులు సమక్షంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ను మరో అమెరికాగా తయారు చేసింది సీఎం కేసిఆర్ అని, భారతదేశంలో 33 మెడికల్ కాలేజ్ లు, 33 నర్సింగ్ హోమ్ లు ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వం వల్ల సాధ్యపడిందని, హైదరాబాద్ లో 100 ప్రముఖ ఐటి కంపెనీలు ఏర్పాటు చేసింది కెసిఆర్ ప్రభుత్వంమే అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రంలో అధికారంలో ఉండి, అక్కడ 4000 పింఛను ఉందా? ఇక్కడ మాత్రం మాటలు చెపుతున్నారు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి తెలంగాణ ప్రజల్లో లేదని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసుల తమ హక్కుల కోసం పోరిడితే వాళ్ళను మోసం చేసి, నక్సల్స్ పేరుతో ఎన్కౌంటర్ చేసి, ఇప్పుడు ఆధివాసులకు అండగా ఉంటామంటున్నారనీ, గత నెల రోజుల క్రితం హైదరాబాద్ వేలంపాటలో ఎకరం భూమి 100 కోట్లు అమ్మింది. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుకోవచ్చు అనే నానుడి ఉందన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ లో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అలా రివర్స్ చేసింది మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ కి స్పందిస్తూ కొంతమంది బాధ్యత రహితమైన మాటలు మాట్లాడుతున్నారనీ అసెంబ్లీ గేట్ దాటానివ్వను అంటున్నారనీ, అసలు అలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన నువ్వు ముందు అసంబ్లీ గేటు దాటాలిగా, అసలైన రాజకీయ నాయకుడికి అహంభావం పనిచెయ్యదు అలా మాట్లాడిన వాళ్ళు చరిత్ర హీనులుగా ఉండిపోతారన్నారు. తుమ్మల సీనియర్ నాయకుడు, మూడుసార్లు మంత్రిగా పనిచేశారు, నేటికీ నాకు తన పై మంచి అభిప్రాయమే ఉందనీ ఒకవేళ పార్టీ మారితే అప్పుడు నిర్ణయాలు వేరే ఉంటాయి అన్నారు. ముఖ్యమంత్రి కి తుమ్మల కు మధ్య జరిగే విషయం, వారి అంతరిగిక విషయం అని, తుమ్మలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గౌరవం రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఇవ్వలేదనీ తుమ్మలకు ఆత్మ సాక్షిగా ముఖ్యమంత్రి గురించి తెలుసనీ, కె సి ఆర్ అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది తుమ్మలకే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పలువురు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !