మన్యం న్యూస్,ములకలపల్లి సెప్టెంబర్ 07:మండలం లొని శిశుమందిర్ విద్యాలయం లొ లయన్స్ క్లబ్ అఫ్ పాల్వంచ కిన్నెరసాని ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు గురువారంఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేదారేశ్వరావు,శిశుమందిర్ ప్రధానోపాధ్యాయులు కుంజా జగన్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్డులు గోపిక, కృష్ణుల వేశాదారణ తో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు, విద్యార్థుల వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో అలరించారు.అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని శిశుందిర్ పాఠశాల ఆవరణలో గాదె తిరుపతి రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేదారెశ్వరరావు, సెక్రటరీ రేపాక ప్రసాదరావు చేతుల మీదుగా ప్రారంభించారు.గెలుపొందిన విద్యార్ధికి 1000/-రూపాయల నగదుని అందజేశారు.ఈ సందర్బంగా క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ, సంస్కృతి సంప్రదాయలను మేలవించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు జగన్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ ప్రసాదరావు, క్లబ్ ట్రెసరర్ ఎండీ రంజాన్, పాఠశాల కమిటీ కోశాధికారి గాదె తిరుపతి రెడ్డి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు. గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
