మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబరు 07::
అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వారికీ కనీస వేతనం 26000 చెల్లించి గ్రాటివిటీ అమలు, పర్మినెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఈనెల 11 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని చర్ల దుమ్ముగూడెం ప్రాజెక్టులోనే మినీ అంగన్వాడి టీచర్ల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తదితర సమస్యలతో వారి డిమాండ్లు పరిష్కారం కోసం ఈనెల 11వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ చిలకమ్మా, తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్ చర్ల, దుమ్ముగూడెం ప్రాజెక్టు నాయకురాలు కమలాదేవి, కృష్ణవేణి, సావిత్రి, సరిత, ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.