మన్యం న్యూస్, చర్ల:ఈ నెల 11న
భద్రాచలం నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏజెన్సీ మండలాలకు సంబంధించి ఏజెన్సీ బంద్ కార్యక్రమం విజయవంతం చేయాలని ఏ ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి పాండు హేమ సుందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో జీవో నెంబర్ 3 ని పటిష్ట చట్టంగా చేసి త్వరలోనే భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఏజెన్సీ డీఎస్సీని నిర్వహించాలని, భద్రాచలం ఏజెన్సీ పరిధిలో ఉన్న ఐటీసీ, పవర్ ప్లాంట్ వంటి సంస్థలు లో ఆదివాసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం నియోజకవర్గం ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, ఆదివాసి యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనీ విజయవంతం చేయాలని కోరారు.