మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
గత నెల 28వ తేదీన జారీచేయబడిన సర్క్యులర్ ప్రకారం సింగరేణి ఉద్యోగుల వారి కుటుంబ సభ్యుల వివరాలను హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వెబ్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేసి డిజిటలైజేషన్ చేయుట కొరకు గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయ జిఎం పర్సనల్ వెల్ఫేర్ ఛాంబర్ నందు జిఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ ఆర్‌సి బసవయ్య సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భముగా జిఎం బసవయ్య మాట్లాడుతూ ఉద్యోగులకు వారి పై ఆధారపడిన అర్హులయిన డిపెండెంట్లకు సకాలములో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వారి వివరాలను వారి వైద్య రికార్డులను హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వెబ్ అప్లికేషన్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఈ నమోదు చేయుటకు అన్నీ గనుల డిపార్ట్మెంట్ల నందు ఉద్యోగులు వారిపై ఆధారపడినవారు మాజీ ఉద్యోగులు వారి జీవిత భాగస్వాముల వ్యక్తిగత ఫోటోగ్రాఫ్‌లు ఆధార్‌ల సేకరణకు అవసరమైన చర్యలు తీసుకోని త్వరత గతిన ఈ డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా ఉద్యోగులకు వారి పై ఆధారపడిన కుటుంబ సభ్యులను వైద్యం కొరకు వచ్చినప్పుడు వైద్య అధికారులు అర్హులైన నిజమైన రోగులను సులభంగా గుర్తించి తక్షణ వైద్య సేవలు అందించడానికి
రిఫరల్ చేసే సమయములో ఎటువంటి జాప్యం జరుగకుండా ఉండేందుకు వీలుగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమములో జిఎం(పర్సనల్) వెల్ఫేర్ ఆర్‌సి కే.బసవయ్యతో పాటు డిజిఎం(పర్సనల్) ధన్ పాల్ శ్రీనివాస్, ప్రొజెక్ట్ మేనేజర్(ఈఆర్‌పి) బి.హరి ప్రసాద్, డిజిఎం(ఐటి) హరి శంకర్, డిజిఎం(పర్సనల్) వి.శ్రీనివాస్ పోత్దార్, పర్సనల్ మేనేజర్ ముకుంద సత్యనారాయణ, డివై.పిఎంలు బి.గట్టు స్వామి, కే.శివ కుమార్, బి.సుశీల్, అనిల్ కుమార్, జి కే.కిరణ్ కుమార్, ఎం.శ్రీనివాస్, ప్రవీణ్, సత్యనారాయణ, డివై.ఐటి మేనేజర్ బి.రీష్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.