ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
* సింగరేణి సేవ అధ్యక్షురాలు మధుర వాణి షాలెం రాజు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్, గౌతమ్ పూర్ రామవరం సేవా సభ్యులతో
ఆర్.సి.ఓ.ఏ క్లబ్ నందు ఏర్పాటుచేసిన
ఉచిత వృత్తి శిక్షణ టైలరింగ్ మగ్గం వర్క్ ఫ్యాషన్ డిజైనింగ్ కార్యక్రమాన్ని గురువారం కొత్తగూడెం ఏరియా సింగరేణి సేవ సమితి అధ్యక్షురాలు ఎం.మధుర వాణి షాలెం రాజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా
సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు. సింగరేణి సేవా సమితి ద్వారా ఈ ఉచిత వృత్తి శిక్షణ తరగతులకు హాజరై నిరుద్యోగ మహిళలు గృహిణులు వారి కుటుంబాలకు ఆర్థిక లబ్ధిని చేకూర్చాలన్నారు. ఈ శిక్షణ తరగతులకు శ్రద్ధగా హాజరై నేర్చుకోవాలని ఇతరులకు నేర్పించాలన్నారు. సింగరేణి సేవా సమితి ఆఫీసర్ జి.సంఘమిత్ర మాట్లాడుతూ సింగరేణి సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధిని శిక్షణను పొంది ఆర్థికంగా ఎదగాలని సేవా సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా సింగరేణి సేవా అధ్యక్షురాలు ఎం.మధుర వాణిషాలెం రాజుతో పాటు పర్సనల్ మేనేజర్ డి.కిరణ్ బాబు, లేడీస్ క్లబ్ సెక్రటరీ అనిత, ఫాతిమా రజాక్, సింగరేణి సేవా సమితి కోఆర్డినేటర్ సిహెచ్.సాగర్, కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ రామాల ప్రసాద్, సింగరేణి సేవా సెక్రటరీ ఆదిలక్ష్మి, శిక్షణ తరగతులు ఇచ్చు ఫ్యాకల్టీ ఇతర సేవ సభ్యులు పాల్గొన్నారు.