పేద ప్రజల అభ్యున్నతే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
గ్రామాలలో బిఅర్ఎస్ విసృత ప్రచారం
బిఆర్ఎస్ గెలుపు ఖాయం: జెడ్పీటీసీ పోశం.నరసింహరావు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని సుందరయ్య నగర్ ఎస్ అర్ కే స్కూల్ ఏరియా లో జరిగిన కేసీఆర్ పల్లె ప్రగతి బాట సమావేశంలో జెడ్పీటీసీ పోశం.నరసింహరావు మాట్లాడుతూ,బిఅర్ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం అని జెడ్పీటీసీ పోశం నర్సింహారావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలే అందుకు నిదర్శమన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా బిఅర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు.పినపాక నియోజకవర్గ అభివృద్దే ప్రభుత్వ విప్ రేగా కాంతరావు లక్ష్యమని,పినపాక నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని,నిరంతరం పరితపిస్తూ,ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు కు మనమందరం రుణపడి ఉండాలని అన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేను గతంలో మనం ఎప్పుడూ చూడలేదని, గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ స్వలాభం కోసం పనిచేసుకున్నరే తప్ప, ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు. భవిష్యత్తులో అలాంటి వారిని మన గ్రామంలోనికి రానివ్వకుండా,ప్రజలందరూ తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.కల్లి బోల్లి మాటలతో మాయ చేయాలని ప్రయత్నించే వారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.నియోజకవర్గం ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు అండగా నిలవాలని కోరుతూ,గడప గడపకు అభివృద్ధి కరపత్రాలను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు ప్రతి ఇంటింటికి అభివృద్ధి పథకాలను వివరించాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎడ్ల శ్రీనివాస్, బాబి జాన్,లక్ష్మీ శెట్టి ప్రసాద్, శ్రీనివాసరావు,కోటమ్మ,సుధా వెంకటేశ్వర్లు,తాళ్లూరి అరుణ, నరసింహారావు,కుమ్మరి కుంట్ల రమేష్,ముజాకర్,మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.