మెడ వంకర పేట్టి కౌగులిలించుకుంటే అభివృద్ధి జరుగుతుందా?
*మూడవ సారి ముఖ్యమంత్రి కేసీఆరే
*పని చేసే ఎమ్మేల్యే దొరకడం పినపాక నియోజకవర్గ అదృష్టం
*రేగా కాంతారావుని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి
*బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పువ్వడా అజయ్ కుమార్
మన్యం న్యూస్, మణుగూరు:మెడ వంకర పేట్టి కౌగులించుకుంటే అభివృద్ధి జరుగుతుందా?అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఇటీవల పార్టీ మారిన కొంతమంది ఖమ్మం జిల్లా నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
మణుగూరు మండలం లోని కిన్నెర కళ్యాణ మండపంలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో మణుగూరు మండల/పట్టణ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ …
పినపాక ఎమ్మేల్యే బుల్లెట్ మాదిరి ఉన్నాడు.. పని చేసే ఎమ్మేల్యే దొరకడం పినపాక నియోజకవర్గ అదృష్టం.తన సమయం మొత్తం కేవలం నియోజకవర్గ అభివృద్ది కోసం పని చేస్తాడు.. నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు.. సెక్రటేరియట్ లో చూస్తూనే ఉంట.
ఆర్టీసి నూతన బస్ స్టాండ్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ఇచ్చిన SDF నిధుల నుండి రూ.5 కోట్లు వెచ్చించడం మంచి విషయం. ప్రజా రవాణా, ప్రజల అస్తి..
పౌర సేవల కోసం, మణుగూరు అభివృద్ది కోసం రూ.25 కోట్లు కేటాయించడం వారికే సాధ్యమైంది.
దండాలు పెట్టుకుంటు.. తల నిమురుకుంటు.. మెడ వంకర పేట్టి కౌగులిలించుకుంటే జరిగుతదా అభివృద్ది.
నిధుల వేట కోసం విప్ శ్రీ రేగ కాంతారావు గారు నిత్యం తిరుగుతారు. అలాంటి మంచి ఎమ్మేల్యే ఉండటం మీ అదృష్టం.
ఇలాంటి వాళ్ళను గెలిపించుకోవాలి. BRS ప్రభుత్వంను తెచ్చుకోవాలి.
కాంగ్రెస్ పార్టీకి బ్యాటరీ ఛార్జింగ్ ఏ ఉండడు. అది ఏనాడో ఎప్పుడో తుప్పుపట్టిపాయింది. మళ్ళీ పని చేయదు.
కరోనా సమయంలో మీరేం చేశారు..? గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తాం. మేం పనిచేశామని. BRS ప్రభుత్వం పని చేసింది.. BRS కార్యకర్తలు తమకు తోచిన రీతిలో పని చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 16వేల మందికి పోడు భూములు పట్టాలు ఇచ్చినం.. సీఎం కేసీఆర్ గారు ఇచ్చారు. కొన్ని ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ ఏం చేసింది. మీరేం చేశారు..?
గోదావరి వరదలు వచ్చాయి.. ప్రజల ప్రాణాలు ఒక్క ప్రాణం అంటే ఒక్క ప్రాణం పోకుండా కంటికిరెప్పలా కాపాడుకున్నాం. గోదావరి అటువైపు నేను .. ఇటు వైపు రేగ కాంతారావు వరదల్లో పని చేశాం. మీరేం చేశారు..? ఇక్కడ నిద్రపోయారు చెప్పాలి.
అలాంటి వాళ్ళను మనం గెలిపించుకోవాలలి. మనకు పని చేసే వారినే మనం గెలిపించుకోవాలి..
ముఖ్యమంత్రి కేసీఅర్ గారు మన జిల్లా రైతాంగం కోసం, ప్రజల కోసం రూ.13వేల కోట్ల రూపాయల సీతారామ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చి లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు ప్రాజెక్ట్ తెచ్చారు.
మనం సీఎం కేసీఆర్ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5సీట్లు, ఖమ్మం జిల్లా లోని 5 సీట్లు గెలిపించుకుని కేసీఅర్ గారికి కనుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈసారి మనం మన పార్టీ నీ గెలిపించుకోవాలని కోరారు.
అనంతరం ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకంలో దూసుకుపోతున్నది .రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతున్నదని దీంతో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించారు
రాష్ట్రంలో మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారం చేపట్టనున్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
2023 జరిగే ఎన్నికలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో అసెంబ్లీ సీట్లు గెలుస్తామన్నారు వేల కోట్ల రూపాయలతో జిల్లాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు.
పార్టీ క్యాడర్ ను సమర్థవంతంగా వినియోగించుకొని ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని అన్నారు దేశం ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి అన్నారు
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతుబంధు రైతు బీమా లాంటి అనేక సంక్షేపధకాలు నేరుగా అందుతున్నాయని అన్నారు..