- తెలంగాణకు కేసీఆర్ యే శ్రీరామరక్ష
- తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బిఅర్ఎస్ తోనే సాధ్యం
- 35 కోట్ల 40 లక్షల రూపాయల తో అభివృద్ధి పనులు
* కాంగ్రెస్ పార్టీకి చార్జింగ్ ఉండదు
శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,విప్ రేగా కాంతరావు
మన్యం న్యూస్ ,మణుగూరు:
పినపాక నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో సుమారు 35 కోట్ల 40 లక్షల రూపయలతో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్,స్థానిక ఎమ్మెల్యే రేగ కాంతారావు కలిసి శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు.మణుగూరు మండల పరిధిలోని హనుమాన్ టెంపుల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రథంగుట్ట అర్బన్ పార్క్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం పార్క్ అవరణలో మొక్కలు నాటారు.
మణుగూరులో ఎస్డిఎఫ్ నిధుల నుండి 5 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న టీఎస్ ఆర్టీసి నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.అనంతరం మణుగూరు పురపాలక సంఘం పరిధిలో ఎస్డిఎఫ్ నిధులు 25 కోట్ల రూపాయల తో నిర్మిస్తున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవనం సీసీ రోడ్స్,సీసీ డ్రైన్స్ తదితర అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ అజయ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మణుగూరు మండల కేంద్రం లోని కిన్నెర కల్యాణ మండపం లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిఅర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో మంత్రి పువ్వాడ పాల్గోన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పై ప్రశంసల జల్లు కురిపించారు.పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు బుల్లెట్ మాదిరి ఉన్నారు అని, పని చేసే ఎమ్మెల్యే దొరకడం పినపాక నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికై అహర్నిశలు తపిస్తూ,అభివృద్ది కోసం పని చేస్తారు అని, వ్యక్తిగతంగా రేగా కాంతరావు నాకు బాగా తెలుసని, సెక్రటేరియట్ లో ఎప్పుడూ చూస్తూనే ఉంటానని అన్నారు. ఆర్టీసి నూతన బస్ స్టాండ్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఅర్ ఇచ్చిన ఎస్డిఎఫ్ నిధుల నుండి రూ.5 కోట్లు వెచ్చించడం మంచి విషయం అన్నారు.ప్రజా రవాణా,ప్రజల అస్తి అని,పౌర సేవలు,మణుగూరు అభివృద్ది కోసం రూ.25 కోట్లు కేటాయించడం వారికే సాధ్యమైంది అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బ్యాటరీ ఛార్జింగ్ ఏ ఉండదు అని,అది ఏనాడో ఎప్పుడో తుప్పుపట్టిపాయింది అన్నారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ పని చేయదు అని ఎద్దేవా చేశారు.కరోనా సమయంలో మీరేం చేశారు అని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తాం,మేం పనిచేశామని,బిఆర్ఎస్ ప్రభుత్వం కరోనా సమయంలో తమ శక్తి మేరకు పని చేసింది అన్నారు.బిఆర్ఎస్ కార్యకర్తలు తమకు తోచిన రీతిలో ఆర్ధిక సహకారాలు,సహాయక పనులు చేశారు అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 16 వేల మందికి పోడు భూములు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఅర్ కే దక్కుతుందన్నారు.కొన్ని ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ ఏం చేసింది అని,మీరేం చేశారు అని ఫైర్ అయ్యారు.గోదావరి వరదలు వచ్చాయి అని,ప్రజల ప్రాణాలు ఒక్క ప్రాణం అంటే ఒక్క ప్రాణం పోకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాం అని తెలియజేశారు.గోదావరి అటువైపు నేను,ఇటు వైపు రేగా కాంతారావు వరదల్లో పని చేశాం అని,మీరేం చేశారు అని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎక్కడ నిద్రపోయారు చెప్పాలి అన్నారు.అలాంటి వాళ్ళను మనం గెలిపించుకోవాలా,లేక మనకు పని చేసే వారినే మనం గెలిపించుకోవాల ప్రజలు అలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.ముఖ్యమంత్రి కేసీఅర్ మన జిల్లా రైతాంగం కోసం,ప్రజల కోసం 13 వేల కోట్ల రూపాయల సీతారామ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చి లక్షల ఎకరాలకు సాగునీరు,త్రాగునీరు అందించేందుకు ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు అన్నారు.మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5సీట్లు,ఖమ్మం జిల్లాలోని 5 సీట్లు గెలిపించుకుని సీఎం కేసీఅర్ కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.ముచ్చటగా మూడోసారి సీఎం కెసీఆర్ సీఎం అవ్వడం ఖాయమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఎస్పి వినీత్,డిఎస్పి రాఘవేందర్రావు, జడ్పిటిసి పోశం నరసింహారావు,ఎంపీపీ కారం విజయ్ కుమారి, ఎంపీటీసీ కోటేశ్వరరావు, స్థానిక సర్పంచులు,ప్రజా ప్రతినిధులు,మున్సిపల్ కమిషనర్,ఉమామహేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.