బీఆర్ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
*మారుమూల గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే రేగాదే
మన్యం న్యూస్ ,కరకగూడెం: మండల పరిధిలోని కొత్తగూడెం, గొల్లగూడెం గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ. ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అదేశాల మేరకు ఇంటింటికి సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావు సోమయ్య , రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, గొల్లగూడెం సర్పంచ్ ఇర్ప.విజయ్ కుమార్ ఉప సర్పంచ్ చేను.సాంబయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు పాలక వెంకటేశ్వర్లు, యువజన మన అధ్యక్షులు గుడ్ల.రంజిత్ కుమార్ సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల. ప్రవీణ్ కుమార్,బొడా.ముత్తయ్య,కొండగొర్ల.నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.