UPDATES  

 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం * సర్పంచ్ కాపులకృష్ణార్జునరావు

 

మన్యం న్యూస్ చర్ల:
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాలను తీసుకొని గర్భిణీ లకు ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వాలని చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు అన్నారు.శనివారం ఐ సి డి ఎస్ ప్రాజెక్టు అధికారిని చైతన్య ఆధ్వర్యలోని చర్ల క్లస్టర్ పరిధిలో ఉన్న  గర్భిణీ మహిళలకు బాలింతలకు సీమంతాలు, అక్షరాభ్యాసాల కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…  అంగన్వాడి కేంద్రానికి వచ్చే గర్భిణీలు అంగన్వాడీ సిబ్బంది అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకొని పోషక ఆహార లోపం లేకుండా తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యవంతమైన శిశువులను జన్మనివ్వాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి సూపర్వైజర్ గుమ్మడి సౌమ్య, అంగన్వాడీ సిబ్బంది స్వరూప, జగదాంబ పలువురు అంగనవాడి కార్యకర్తలు, సహాయకులు, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !