మన్యం న్యూస్, బూర్గంపహాడ్: మండల పరిధిలోని సీనియర్ బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు జక్కం సుబ్రహ్మణ్యం కొద్దిరోజుల క్రితంజరిగిన ప్రమాదం లో కాలు విరిగింది .ఈ నేపథ్యంలో బూర్గంపహాడ్ సొసైటీ చైర్మెన్ బిక్కసాని శ్రీనివాస్ శనివారం సుబ్రహ్మణ్యం స్వగృహం కి వెళ్లి పరామర్శించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ బొల్లు రవి,మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రసిడెంట్ గోనేల నాని మండల బిఆర్ఎస్ పార్టీ నాయుకులు తోకల సతీష్ బూర్గంపహాడ్ పట్టణ నాయకులు కేసుపాక రామకృష్ణ,మేక పున్నం,గుండె సతీష్ పలువురు నాయకులు పాల్గొన్నారు.