ఔదార్యం చాటుకున్న సర్పంచ్ వెంకటముత్యం
*నిస్సహా స్థితిలో వున్నా వ్యక్తికి రూ.10వేల ఆర్థిక సహాయం
మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 09: మండల పరిధి అచ్చుతాపురం గ్రామానికి చెందిన కిన్నెర చెన్నారావు (40) కొన్ని రోజులు క్రితం మామిడికాయలు కోస్తున్న క్రమంలో కాలుజారి చెట్టు మీద నుండి క్రిందపడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న నారం వారిగూడెం సర్పంచ్, చిట్టి తల్లి ఉచిత సేవాసమితి వ్యవస్థాపకులు మనుగొండ వెంకటముత్యం శనివారం కిన్నెర చెన్నారావు నివాసం వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురుంచి అడిగి తెలుసుకున్నారు. వారి దీనగాదును తెలుసుకున్న సర్పంచ్ రూ 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండలం ప్రైవేట్ మెకానిక్ యూనియన్ లీడర్ కుందవరపు శ్రీనివాసరావు, చిట్టితల్లి ఉచిత సేవా సమితి అంబులెన్స్ సర్వీస్ వారియర్ చిమ్మటబోయిన సురేష్, సుజిత్ రాజ్, రాజిని రమేష్, వేముల రమేష్ గ్రామస్థులు బెల్లం భీమసేన గణేష్, మాజీ సర్పంచ్ మనుగొండ లక్ష్మణరావు, గొల్లమందల లక్ష్మణరావు, మారుతి ధర్మయ్య, కాసిన చిన్న రాయుడు, కాసిన నాగు, పట్టేల నాగముత్యం, ముద్దిన కొర్రాజులు తదితరు పాల్గొన్నారు.
