మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 9::
మండల పరిధిలోని కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో డాక్టర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 46 మందికి సాధారణ పరీక్షలు నిర్వహించగా జ్వరం ఉన్న నలుగురికి రక్త పరీక్ష చేసి మందులు ఇవ్వడం జరిగింది. తదనంతరం గ్రామంలో జరుగుతున్న రాపిడ్ ఫీవర్ సర్వే ప్రోగ్రాం తనిఖీ చేశారు. వర్షాకాలం సాధారణంగా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు, ఇంటి చుట్టూ నీటి నిలవలు లేకుండా చూసుకోవాలన్నారు అదేవిధంగా ప్రతి మంగళవారం శుక్రవారం డ్రై డే పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సాగర్, హెల్త్ అసిస్టెంట్ నరసింహారావు, ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.