మన్యం న్యూస్,మణుగూరు:
తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగాకాంతారావు ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రివర్యులు రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ సమక్షంలో పీవీ కాలనీ మాజీ ఎంపీటీసీ కొమరం పాపారావుబిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.శనివారం మండల పరిధి కిన్నెర కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయగా… మంత్రి సమక్షంలో పాపారావు బి ఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా, పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారని అన్నారు.
