మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 09: అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి పంచాయతీ, పాపిడిగూడెం అంగన్వాడి కేంద్రంలో గ్రామ సర్పంచ్ సాధు జ్యోత్స్న బాయి సందర్శించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో బాలింతలకు పిల్లలకు గుడ్లు బాలామృతం పంపిణీ చేశారు. అనంతరం రికార్డ్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాధు జ్యోత్స్న బాయి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, చిన్నారుల తల్లులకు పోహకారంపై అవగాహన కార్యక్రమం జరిగిందని, గర్భిణీ స్త్రీలు, చిన్నారుల తల్లులు పోషహకారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోషక పదార్థాలను బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో.. అంగన్వాడీ టీచర్ ఉష, ఆయా, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, విద్యార్థినిలు, పంచాయతీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.