తిప్పనపల్లి గ్రామానికి డ్రైనేజీ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కి వినతి..
జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ రసూల్..
మన్యం న్యూస్ చండ్రుగొండ సెప్టెంబర్ 09 : మండల పరిధిలో గల తిప్పనపల్లి గ్రామంలో బస్టాండ్ సెంటర్ నుండి పాతూరు మీదుగా జమల వాగు బ్రిడ్జి వరకు 3 కోట్ల 52 లక్షలు డ్రైనేజీ అంచనా విలువ తో శనివారం ఎమ్మెల్యేకు జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడుసయ్యద్ రసూల్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తిప్పనపల్లి గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు తెలుపగా సంబంధిత అధికారులకు అంచనా వేసి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ రసూల్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పందించిన విధానం, గ్రామ ప్రజలకు తెలుపుగా అభినందించారు, గ్రామ ప్రజలు వచ్చే ఎన్నికల్లో గెలిపించి రుణం తీర్చుకుంటామన్నారు.