మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 09::
మండలంలోని కొత్తమరేడుబాక గ్రామానికి చెందిన బుద్ధుల లావణ్య శ్రీ(06) అనే చిన్నారి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. కోటేశ్వరరావు- జయ దంపతుల లావణ్య జ్వరంతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం నరసాపురం ఆర్.ఎం.పి దగ్గర చికిత్సను అందించారు. వారం రోజులుగా చికిత్స చేసిన జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందిస్తున్న గా చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతిచెందిన సంఘటన తీయడంతో గ్రామస్తులు చలించిపోయారు. ఇదే గ్రామంలో డెంగ్యూ కేసులు అధికంగా ఉన్నాయని వైద్యాధికారులు హెల్త్ క్యాంపు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. చికిత్సకు మించి వైద్యం చేస్తున్నటువంటి ఆర్ఎంపీలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.