మన్యం న్యూస్,ఇల్లందు:జిల్లా ఎస్పీ డా.వినీత్ ఆదేశాలమేరకు ఇల్లందు సబ్ డివిజన్లో ఉన్న పోలీసు స్టేషన్ల పరిధిలో నివసించే పట్టణ, గ్రామీణప్రాంత ప్రజలు పండుగలకు, ఫంక్షన్లకు ఊర్లకు వెళ్ళేవారు 8019470958 నంబరుకు వాట్సాప్ ద్వారా వారి పూర్తివివరాలను, గూగుల్ లొకేషన్ ను పంపించడం ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసు బీట్ పెట్రోలింగ్‌ను ఏర్పాటుచేయడం జరుగుతుందని డిఎస్పీ రమణమూర్తి శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలియజేసారు. దొంగతనాలను అరికట్టడంలో భాగంగా జిల్లాఎస్పీ ఆదేశాలప్రకారం అన్నిప్రాంతాల్లో ప్రత్యేకనిఘా ఏర్పాటుచేయడం జరుగుతుందని తెలిపారు. సాధ్యమైనంతవరకు విలువైన వస్తువులను, ఆభరణాలను తమఇండ్లలో ఎట్టి పరిస్థితుల్లో వదిలివెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. పండుగ సెలవులకు, ఫంక్షన్లకు సుదూరప్రాంతాలకు వెళ్లేప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీసువారికి సమాచారం అందించి సహకరించాల్సిందిగా డీఎస్పీ విజ్ఞప్తిచేశారు.