మన్యం న్యూస్ చర్ల:
ప్రజల కోసం పార్టీ కోసం నిరంతరం పని చేస్తున్న నాయకుడు, మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడంలో అతని కృషి పట్టుదల ఎంతగానో ఉన్న వ్యక్తి, పార్టీ బలోపేతానికి దోహదపడే సీనియర్ నాయకుడు దొడ్డి తాతారావు. ఈయన మాష్టారు గా కళాశాలలో విద్యార్థులకు నాయకత్వం వహించి ఉపాధ్యాయు వృత్తిలో పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘానికి మండల, జిల్లా, రాష్ట్ర నాయకత్వం చేసి ఉపాధ్యాయ సేవలో నిరంతరం పనిచేసి ఉపాధ్యాయుల అభిమానాన్ని సంపాదించారు. రిటైర్డ్ అయిన తరువాత 2020 లో బిఆర్ యస్ పార్టీలో చేరి పార్టీ కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈయనకు కృషికి మండల ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని చెప్పారు. ఇటీవల కాలంలో ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్ అకాల మరణంతో ఆ పదవి దొడ్డి తాతారావు మాష్టారుకి ఇస్తారని కార్యకర్తలు ఆశించారు కాని పదవి ఉన్న వారికే పదవి ఇచ్చి కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. బాలసాని లక్ష్మినారాయణ పార్టీలో చేరిన నాటి నుండి నేటి వరకు నిరంతరం పార్టీ కార్యక్రమాలలో పాల్గొని పార్టీ ఆఫీసులో ఉంటు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తు అవకాశం ఉన్నంత వరకు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తి సహకారం అందిస్తు కార్యకర్తల అభిమానాన్ని పొందుతున్న ఇటువంటి వారికి మంచి పదవి ఇస్తే పార్టీకి కార్యకర్తలకు ప్రజలకు ఉపయోగం ఉంటుందని కార్యకర్తలు కోరుతున్నారు