మన్యం న్యూస్ గుండాల: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మండలంలో శనివారం పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. గుండాల మండలం జగ్గయ్య గూడెం గ్రామంలో మరణించిన పొం బోయిన స్రవంతి దశదినకర్మకు హాజరై నివాళులు అర్పించారు. మండల కేంద్రంలో సీనియర్ టిడిపి నాయకురాలు తడిశెట్టి రాజ్యలక్ష్మి మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మటమ్ లంక గ్రామానికి చెందిన తన చిన్ననాటి స్నేహితుడైన మోకాళ్ళ పొట్టయ్య మరణించడంతో అతని పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొమరం శాంతయ్య, ఇల్లందు పార్టీ కార్యదర్శి కుమార్, పార్టీ నాయకులు శంకరన్న, వెంకన్న, కృష్ణ , పునేం మంగయ్య, సనప కుమార్, సింగన్న, కోడూరి జగన్, రామన్న తదితరులు పాల్గొన్నారు.
