మన్యం న్యూస్, గుండాల: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం సరైనది కాదని టిడిపి మండల అధ్యక్షులు తోలెం సాంబయ్య అన్నారు. శనివారం మండలం పరిధిలోని జగ్గయ్య గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమంగా సెల్ కంపెనీలను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారని అభివాదంతో దొడ్డిదారిన అరెస్టు చేశారన్నారు. అక్రమ అరెస్టులకు తెలుగుదేశం పార్టీ భయపడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అప్పారావు, కనకయ్య, రమేష్, మల్లయ్య, మధు, రామకృష్ణ, పాపయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
