మన్యం న్యూస్, కరకగూడెం:మండల పరిధిసమత్ బట్టుపల్లి గ్రామానికి చెందిన అ గ్రామ సమ్మక్క- సారలమ్మ గుడి నిర్వాహకులు పోలెబోయిన సుందరయ్య( 92 ) అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి హాజరై మృతదేహాన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అమె మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సమ్మక్క-సారలమ్మ దేవర బలగా బుద్దారం అటవీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో నిర్వహించే జాతర నిర్వహకులు మృతి చెందడం మరి ఖమ్మం, వరంగల్ జిల్లాల భక్తులకు తీరంలోటాలే ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు రగడ సానుభూతి తెలియజేసి కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,సీనియర్ నాయకులు బైరిశెట్టి.చిరంజీవి, యువజన నాయకులు కటుకోజ్వల.దీలిప్ తదితరులు పాల్గొన్నారు.
