ఏఐటియూసీ పొరాటలకు దిగివచ్చిన యాజమాన్యం సింగరేణి కార్మికుల పదకొండొవ వేతన బకాయిలు ఒకేదఫా చెల్లింపుకు అంగీకారం
మన్యం న్యూస్,ఇల్లందు:సింగరేణి కార్మికుల పదకొండొవ వేతన బకాయిలు ఒకేదఫా చెల్లించాలని ఏఐటియుసి ఆద్వర్యంలో అనేక రూపాల్లో చేసిన ఆందోళనల ఫలితంగా డైరెక్టర్ పా బలరాం ఈనెల 21వ తేదీన చెల్లిస్తామని తెలిపారని, ఇది ఎఐటియుసి పొరాట ఫలితమెనని బ్రాంచి కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్ అన్నారు. ఏఐటియుసి కృషి ఫలితంగా ప్రకటన వెలువడిన తర్వాత మేమే సాదించామని గొప్పలు చెప్పతున్న గుర్తింపు సంఘం టీబిజీకేఎస్ కు,
వేజ్ బోర్డుకి సంబంధం లేదని ఇంతకాలం ఏరియర్స్ ఇవ్వడంలో జాప్యం జరిగితే ఎలాంటి పోరాటానికి ముందుపడని గుర్తింపు సంఘం వైఖరిని కార్మికులు గమనిస్తున్నారన్నారు. మేనేజ్మెంట్ ప్రకటించిన తర్వాత అది మా ఘనతే అని చెప్పుకోవటానికి సిగ్గుపడాలని, యాజమాన్యంతో పోరాడచాతకాకుండా, కార్మిక సంఘంగా బాధ్యతలు నిర్వర్తించకుండా అది నిర్వర్తించకుండా నేడు తమ ఘనతే అని చెప్పుకోవడం వారి అసమర్ధత, అజ్ఞానానికి నిదర్శనమన్నారు. నెలరోజుల నుండి మూడుదశలుగా పోరాడింది ఏఐటీయూసీ అని, గనులు డిపార్ట్మెంట్ల మీదధర్నాలు చేసి సింగరేణివ్యాప్తంగా అన్ని జీయం ఆఫీసుల ముందు ధర్నాలు చేసి ముట్టడి చేయడం, అలాగే డైరెక్టర్ పాని కలిసి మాట్లాడటం మూలాన కార్మికులకు వేతన బకాయిలు అందుతున్నాయని నజీర్ అహ్మద్ ఆదివారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.