మన్యం న్యూస్ చండ్రుగొండ,సెప్టెంబర్ 10: టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయటం అప్రజాస్వామికమని టిడిపి మండల అధ్యక్షులు వారాది సత్యనారాయణ అన్నారు. ఆదివారం టిడిపి మండల కమిటి ఆద్వర్యంలో చంద్రబాబు అరెస్టును నిరశిస్తూ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ… ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, సామాన్యులు బ్రతికే పరిస్థితులు లేవని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. వైసిపి పాలనలో ప్రతిపక్షపార్టీలకు ఇబ్బందులు తప్పటం లేదన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దడిగల మల్లేష్, కొదుమూరి సత్యనారాయణ, చాపలమడుగు వెంకటేశ్వర్లు, కాశి, తదితరులు పాల్గొన్నారు.