అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి
మన్యం న్యూస్, అశ్వాపురం:అశ్వాపురం మండలం మొండికుంట లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకను ఎంపిటిసి కమటం నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా రజక సంఘం నాయకులు చెన్నురి వీరభద్రం ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎంపిటిసి నరేష్ మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వం రాజ్యమేలుతున్న కాలంలో వెనుకబడిన కులాల ప్రజలు దొరల ఇళ్ళల్లో, పొలాల్లో వెట్టిచాకిరీ, భూస్వాముల అకృత్యాలను ఎదుర్కొనడానికి ప్రజలను చైతన్యం చేస్తు కమ్యూనిస్టు పార్టీ భావాల పట్ల ఆకర్షితురాలైన చాకలి ఐలమ్మ పార్టీ చేపట్టే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేది. ప్రతి ఊరిలో సాయుధపోరాట ఉద్యమం రూపుదాల్చడానికి ఐలమ్మ చేసిన కృషి, భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి గుర్తుగా తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో చిరస్మరణీయురాలై నిలిచిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు కందిమళ్ల రామిరెడ్డి, తుక్కనీ మదుసుధన్ రెడ్డి, సురకంటి ప్రభాకర్ రెడ్డి ,పినికేశి సుధాకర్ రెడ్డి,కొల్లు లింగారెడ్డి,దండి నాగేశ్వరరావు, బచ్చు వెంకటరమణ,పాములు, రణబోతుల రామిరెడ్డ తదితరులు పాల్గొన్నారు.