UPDATES  

 చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలి.. కారం పుల్లయ్య

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 10::
తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఉద్యమించాలని సిపిఎం పార్టీ నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య తెలిపారు. ఆదివారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువ, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సాయిధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వంశీకృష్ణ, చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు మహమ్మద్ బేగ్, శోభారాణి, చంటి, మహేంద్ర నాథ్, శాంతి కుమారి, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !