బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతరావు భారీ మెజారిటీతో గెలువడం ఖాయం
ఆళ్లపల్లి జడ్పిటిసి హనుమంతరావు, మండల అధ్యక్షులు నరసింహారావు
మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే,బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారని మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ఆళ్లపల్లి జడ్పిటిసి కొమరం హనుమంతరావు అన్నారు. ఆదివారం నడిగూడెం పంచాయతీలో గల జాకారం గ్రామంలో ఇంటింటికి రేగా, ఇంటింటికి ప్రభుత్వ పథకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన అన్నారు. ఆళ్లపల్లి మండలంలో గతంలో ఏ నాయకుడు చేయనంత అభివృద్ధిని రేగా కాంతారావు చేశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది రేగా కాంతారావేనని అన్నారు. ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పించారని అంతర్గత రహదారులకు మహర్దశను తీసుకువచ్చారని అన్నారు. రేగా అభివృద్ధి విషయంలో మరెవ్వరు సాటి రారని అన్నారు. సంక్షేమ సారధి వెంటే ఆళ్లపల్లి మండల ప్రజలు ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొమరం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు ముసలయ్య, రామ నరసయ్య, వేమూరి సత్యం, గ్రామస్తులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
