మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రపంచ ఆదివాసి హక్కుల దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 12,13 తేదీలలో భద్రాచలంలో భారతదేశంలో గల పది రాష్ట్రాల ఆదివాసి నాయకులు సమ్మేళన సాంస్కృతిక సాంప్రదాయాలపై జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ,ప్రభుత్వ విప్ రేగా కాంతరావుకు ఆహ్వానాన్ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అశోక్ చౌదరి, వినయ్ విక్క,ఆదివాసి ఉద్యోగ సాంస్కృతిక సంఘం నాయకులు కొండ్రు వీరస్వామి, వీసాల కృష్ణయ్య,రేస్ కళ్యాణ్, గని బోయిన శంకరయ్య,ఇర్ఫ శ్రీను తదితరులు పాల్గొన్నారు.