బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ హోదాలో తొలిసారిగా ఇల్లందుకు విచ్చేస్తున్న రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీశ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాలు, మండల, మహిళా, యూత్ కమిటీ నాయకులు సోమవారం ఉదయం 11 గంటలకు జరగబోయే వద్దిరాజు రవిచంద్ర పర్యటనకు అందరూ సకాలంలో హాజరై విజయవంతం చేయాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.