మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని ముత్యాలమ్మ నగర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పడిగ అంజయ్య,రాణి దంపతులు నూతన గృహ ప్రవేశ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు,సుధారాణి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులకు విప్ రేగా దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ముత్యాలమ్మ నగర్ గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ ఇర్ఫ నాగార్జున,లక్ష్మీ ప్రసన్న దంపతుల కుమారుడు నీరజ్ కార్తికేయ మొదటి పుట్టినరోజు వేడుకలకు విప్,రేగా కాంతారావు దంపతులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నీరజ్ కార్తికేయను అక్షింతలు వేసి,ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు,మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,ముఖ్య నాయకులు వట్టం రాంబాబు, ఆదివాసి ఉద్యోగ సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు పోలేబోయిన అనిల్ కుమార్ , స్థానిక నాయకులు,యువజన నాయకులు,పోలీసు అధికారులు,తదితరులు పాల్గొన్నారు.