మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆఫీస్ ప్రాంగణం లో నూతనంగా నిర్మించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్,పంచాయతీరాజ్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు ప్రారంభించారు.ఈ సందర్భంగా పంచాయతీరాజ్ డిఈ సైదులు రెడ్డి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం డిఈ సైదులు రెడ్డిని ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు శాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు,మణుగూరు జడ్పిటిసి పోశం.నరసింహారావు,ఎంపీపీ లు కారం విజయకుమారి, గుమ్మడి గాంధీ,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, ఎంపీటీసీ ల జిల్లా కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు, సర్పంచ్ బచ్చల భారతి,స్థానిక ప్రజా ప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.