UPDATES  

 బంగారు తెలంగాణ నిర్మాణం సీఎం కేసీఆర్ తోనే సాధ్యం

  • బంగారు తెలంగాణ నిర్మాణం సీఎం కేసీఆర్ తోనే సాధ్యం
  • సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ కు శ్రీరామరక్ష…
  • వ్యవసాయ,తాగునీటి రంగాలలో దేశానికి దిక్సూచి
  • అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవమే ధ్యేయం
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు,ఎమ్మెల్సీ తాతా మధు

మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా కాంతారావు మాట్లాడుతూ,సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రజలపై సీఎం కేసీఆర్ కు ఉన్నంత ప్రేమ మరెవరికి ఉండదన్నారు.ప్రజల సమస్యలు,వారు బాగోగులపై సీఎం కెసీఆర్ కు ఉన్న అవగాహన మరెవరికి లేదన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామం లో అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు.సీఎం కేసీఆర్ విజన్ తో చేసిన అభివృద్ధి వల్లనే నేడు తెలంగాణ పల్లెలకు అవార్డులు వస్తున్నాయన్నారు, ప్రతి గ్రామానికి తాగునీరు 24 గంటల ఉచిత కరెంటు,పల్లె ప్రకృతి వనాలు,క్రీడ మైదానాలు ఏర్పాటు చేశామన్నారు.రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రాజధానిలో ఆత్మగౌరవ భవనాలను నిర్మించి చరిత్ర సృష్టించారన్నారు.వారి స్ఫూర్తితోనే నేడు పినపాక నియోజకవర్గం లో ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ,పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగా కాంతారావును సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,రేగా కాంతారావుకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను ఎమ్మెల్సీ తాతా మధు శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ,ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో గెలిస్తే 4000 రూపాయాలు పెన్షన్ ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మొన్ననే గెలిచిన కర్ణాటకలో 4000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.రూ 200 ఉన్న పెన్షన్ ను 2000 చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు.కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మొద్దు అని సూచించారు.తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం చేసిన పార్టీ బిఅర్ఎస్ అన్నారు.కోట్ల రూపాయలతో బంజారా, కోమరం భీమ్ భవనాలు నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నారు.రాష్ట్రం లో నియోజకవర్గ ఆత్మ గౌరవ భవనాలు నిర్మాణాలు చేపట్టిన ఏకైక ఎమ్మెల్యే రేగా కాంతరావు అని కొనియాడారు.తెలంగాణ లో రైతాంగానికి పెద్ద పీట వేసి, రైతుబంధు,రైతు బీమా,24 గంటలు ఉచిత విద్యుత్, సాగునీరు సాకాలంలో ఎరువులు,అందించి దేశానికి ధాన్యగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని,నెంబర్ వన్ స్థానంలో నిలవడం జరిగిందన్నారు.పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా నిలిచి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 12 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లి చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.ఆసరా పెన్షన్,కుల వృత్తులకు ప్రోత్సాహం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేదలకు, రైతులకు సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు అన్నారు.మిషన్ భగీరథ ద్వారా 11లెవల్ లో నీటి నీ శుద్ధి చేసి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నాం అన్నారు.ఐటీ లో తెలంగాణ టాప్ అన్నారు.పినపాక నియోజకవర్గం అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు.అడిగిన వెంటనే కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.పినపాక నియోజకవర్గ ప్రజలు
రేగా కాంతరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.అభివృద్ధి,సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు మణుగూరు జడ్పిటిసి పోశం. నరసింహారావు,ఎంపీపీ కారం విజయకుమారి,భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం.వెంకటరావు, బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి భవాని శంకర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు పార్టీ ముఖ్య నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !