మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పొంగులేటి పర్యటించి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో పొంగులేటి అభిమానులు ఏర్పాటు చేసుకున్న పొంగులేటి శీనన్న కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు పేదలకు ఇందిరమ్మ పథకం కింద ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. పేద వర్గాల సంక్షేమ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసిందని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తర్వాత బస్టాండ్ సెంటర్లో తెలంగాణ ఉద్యమకారులు ఫోరం నాయకులు చేపట్టిన ఉద్యమకారుల ఆత్మగౌర శాంతి దీక్షకు పొంగులేటి మద్దతు తెలిపి మాట్లాడారు. అదేవిధంగా కొత్తగూడెం లోని వివిధ పత్రికలలో పనిచేసే స్టాప్ రిపోర్టర్లతో పొంగులేటి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, ఊకంటి గోపాలరావు, ఆళ్ళ మురళి, పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.