మీరు రండి కలిసి పని చేద్దాం…
* తుమ్మలను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కాంగ్రెస్ లోకి మీరు రావాలి.. జనంలో మీరు ఉండాలి అంటూ భద్రాచలం ఎమ్మెల్యే పొదెం
వీరయ్య మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకులు తుమ్మల నాగేశ్వరావును ఆహ్వానించడం జరిగింది. సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తుమ్మల నాగేశ్వరావు ఇంటికి వెళ్లి కలిసి పలకరించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరావును కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ లోకి వస్తే కలిసి పనిచేద్దామని ఇంకా అప్పుడు ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు. తరువాత తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తన అభిమానుల ప్రజల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను తుమ్మల సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు తోట దేవి ప్రసన్న, టిపిసిసి సభ్యురాలు సున్నం నాగమణి తదితరులు పాల్గొన్నారు.