నేడు బిఆర్ఎస్ నూతన జిల్లా అధ్యక్షులు కాకులమర్రి,ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి పర్యటన విజయవంతం చేయండి
– కుడుములు లక్ష్మి నారాయణ.
మన్యం న్యూస్,మంగపేట:
బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నూతన అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, జడ్పీ చైర్మన్ ములుగు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి మండలంలో నేడు పర్యటించనున్నారని పర్యటించనున్నారని బీ ఆర్ ఎస్ పార్టీమండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మి నారాయణ తెలియజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, బి ఆర్ ఎస్ కుటుంబ సభ్యులందరు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.
