మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం ఐటీడీఏ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బారులో గిరిజనుల నుండి వచ్చిన దరఖాస్తులను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ స్వయంగా స్వీకరించారు.గిరిజన దర్బారులో వివిధ మండలాల నుండి వచ్చిన దరఖాస్తులను సంబంధిత సెక్టార్ అధికారులకు బదిలాయించారు.వాజేడు మండలం జంగాలపల్లి కి చెందిన భారతి యు ఆర్ జె సి పాఠశాలలో వంట చేయుటకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన స్వప్న కాటారం గురుకులంలో అటెండర్ పోస్టు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈసం స్వప్న తనకు ఉద్యోగం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు.భూక్య జ్యోతి ఉపాధ్యాయురాలు తను వాజేడు మండలం పేరూరు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాను.తన సొంత జిల్లా ఖమ్మంకు బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన గొగ్గలి నాగేశ్వరరావు ఇంచర్ల గిరిజన గురుకుల పాఠశాల యందు అడ్మిషన్ ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు.ఏటి ఎఫ్ ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు మైపతి సంతోష్ కుమార్ ములుగు జిల్లాలలో ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లు 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 03 అమలు చేయాలని దరఖాస్తు చేసినారు.ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామపంచాయతీ సర్పంచ్ కాక వెంకటేశ్వర్లు కొండాయి నుండి మేడారంనకు వెళ్లే దారిలో కొండ్రేడు వాగుపై మరమ్మతులు చేయుటకు నిధులు మంజూరు ఇప్పించాలనే దరఖాస్తు చేసినారు.వాజేడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ ట్రైబల్ రిలీఫ్ ఫండ్ ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు,డిప్యూటీ డైరెక్టర్ పోచం,ఎస్ డి సి డిఎస్ వెంకన్న,డిప్యూటీ డిఎంహెచ్వో క్రాంతి కుమార్,ఎస్ ఓ రాజ్ కుమార్,ఐటీడీఏ మేనేజర్ శ్రీనివాస్ వివిధ సెక్టార్ల అధికారులు పాల్గొన్నారు.
